తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

Apr 18,2024 22:44
రాక్‌ సిరామిక్‌ పరి శ్రమలో

ప్రజాశక్తి – కాకినాడ

రాక్‌ సిరామిక్‌ పరి శ్రమలో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకట రమణ డిమాండ్‌ చేశారు. గురువారం విధులను నిలుపు దల చేసిన కార్మికులతో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ కార్యా లయం వద్ద ధర్నా చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని విధులను నిలుపుదల చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకునేలాగా చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ ఎన్‌.బుల్లిరాణికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పర్మినెంట్‌ కార్మికుల పనులను నిలుపుదల చేయడం దారుణమని అన్నారు. పర్మినెంట్‌ కార్మికులను అర్థంతరంగా యాజమాన్యం గేటు వద్ద సెక్యూరిటీతో నిలుపుదల చేసి పనిలోకి రావద్దని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఒంటిలో శక్తి ఉన్నంతకాలం కార్మికులతో పని చేయించుకుని పరిశ్రమ లాభాలు గడించి వయసు మీరుతున్న సమయంలో వారిని అన్యాయంగా తొలగించడం దారుణమన్నారు. తక్షణమే నిలుపుదల చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకుని సమస్యను పరిష్కారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుబ్బల వెంకట మల్లికార్జున, కుక్కల చంద్రన్న, కాళ్ళ మంగారావు, గుబ్బర్తి క్రాంతికుమార్‌, వాడపర్తి సతీష్‌కుమార్‌, వల్లూరి వీరవెంకటసుబ్బారావు, జగ్గు మహంతి వీరవెంకటసత్యనారాయణ, బిల్లా ప్రభుదాస్‌ పాల్గొన్నారు.

➡️