రాష్ట్రంలో దొంగలు పడ్డారు

May 4,2024 23:36
రాష్ట్రంలో దొంగలు పడ్డారు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రాష్ట్రంలో దొంగలు పడ్డారని, కాకినాడలో బందిపోటు దొంగ ఉన్నాడని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. శనివారం రాత్రి ఆయన కాకినాడలో నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొన్నారు. అనంతరం కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ అభ్యర్థి వనమాడి కొండబాబు అధ్యక్షతన సంత చెరువు సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన ప్రశాంత కాకినాడ నగరాన్ని భూ కబ్జాలకు, అరాచకాలకు, రౌడీయిజానికి, గుండాయిజానికి, క్రికెట్‌ బెట్టింగ్‌లకు, పేకాట క్లబ్బుల నిర్వహణకు నిలయంగా మార్చేశారని దుయ్యబట్టారు. స్థానిక ఎంఎల్‌ఎ తండ్రి సివిల్‌ సప్లై కార్పొరేషన్‌కు, అతని తమ్ముడు రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా పని చేస్తూ భారీ ఎత్తున బియ్యం అక్రమ రవాణా సాగిస్తున్నారని ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిని ఉద్దేశిస్తూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. టిడిఆర్‌ బాండ్ల పేరుతో పెద్ద కుంభకోణం చేస్తున్నారన్నారు. జయలక్ష్మి కో ఆపరేటివ్‌ బాధితులుగా ఉన్న 26 వేల మంది ఖాతాదారులను రోడ్డున పడేశారన్నారు. ఒఎన్‌జిసి డబ్బులను కొట్టేశారన్నారు. రూ.100 కోట్ల విలువైన భూదాన భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఆయన అవినీతి సామ్రాజ్యం జిల్లా మొత్తం వ్యాపించిందని విమర్శించారు. పెద్దాపురం, జగ్గంపేట, అనపర్తి ప్రాంతాల్లో గ్రావెల్‌ తవ్వకాలకు పాల్పడుతున్నారన్నారు. రామేశ్వరం మెట్టను పూర్తిగా నాశనం చేశారన్నారు. కాకినాడ పోర్టును బంగారం గనిగా మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పై విరుచుకుపడ్డారు.ప్రశాంతతకు మారుపేరు అయిన తూర్పు గోదావరిలో రౌడీయిజం భారీగా పెరిగిపోయిందన్నారు. పవిత్రమైన గోదావరి సాక్షిగా ఈ జిల్లాను నాశనం చేస్తుంటే వదిలి పెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. జగన్‌ పాలన వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి

➡️