రసాయన శాస్త్ర ప్రయోగాలపై శిక్షణ

Apr 25,2024 23:02
రసాయన శాస్త్ర ప్రయోగాలపై విద్యార్థులకు

ప్రజాశక్తి – పెద్దాపురం

రసాయన శాస్త్ర ప్రయోగాలపై విద్యార్థులకు 5 రోజులపాటు శిక్షణా శిబిరం ప్రారంభం అయ్యింది. గురువారం స్థానిక రామారావుపేటలోని ఎసిటి సైన్స్‌ సెంట ర్‌లో క్యాంపు నిర్వహకులు బుద్దా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణా కార్యక్రమాన్ని స్థానిక మహారాణి కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు గంగాధరుడు ప్రారంభిం చారు. బుద్దా శ్రీనివాస్‌ మాట్లాడుతూ పెద్దాపురం పట్టణ, మండల పరిధిలోని విద్యార్థులే కాకుండా తుని, కోరుకొండ, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ శిక్షణా శిబిరంలో మూలకాల ఆవర్తన పట్టిక తయారీ, వడపోత, ఆర్బిటాల్ల తయా రీ, భౌతిక మార్పు, రసాయనిక మార్పు, రసాయన శాస్త్ర ప్రయోగశాలలోని పరికరా లపై అవగాహన, ఫుడ్‌ బింగో గేమ్‌ వంటి అనేక అంశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసం ఏర్పాటు చేసిన ఐదు రోజుల శిక్షణ పట్ల విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ప్రయోగాల్లో భాగస్వాములు కావాలన్నారు.

➡️