పెద్దాపురం ‘కోట’పై వైసిపి జెండా ఎగురవేస్తాం

Apr 25,2024 23:00
పెద్దాపురం కోటపై రానున్న

ప్రజాశక్తి – సామర్లకోట

పెద్దాపురం కోటపై రానున్న ఎన్నికల్లో వైసిపి జెండాను ఎగురవేస్తామని వైసిపి అభ్యర్థి దవులూరి దొరబాబు జోస్యం చెప్పారు. స్థానిక వైసిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 దశాబ్దాల అనంతరం అత్యధిక మెజారిటీతో వైసిపి అభ్యర్థిగా తాను విజయం సాధించి పెద్దాపురం నియోజవర్గం కోటపై స్థానికుడి జెండా ఎగురవేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. 25 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎంఎల్‌ఎ కావాలన్నా తన ఆకాంక్షకు సిఎం జగన్‌ తనకు సీటు ఇచ్చి ఊపిరి పోసారన్నారు. తాను పిలుపు ఇవ్వకపోయినా నామినేషన్‌ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన నియోజకవర్గ పరిధిలోని పార్టీ శ్రేణులు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 40 సంవత్సరాలుగా నియోజవర్గంలో స్థానికేతరులే రాజకీయం చేస్తున్నారని, ఈ ఎన్నికల్లో వారిని ఇంటికి పంపించి స్థానిక జెండాను ఎగరవేస్తామన్నారు. సిఎం జగన్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తనకు విజయాన్ని అందిస్త్యాని అన్నారు. తాను శాసనసభ్యునిగా గెలుపొంది అవినీతి రహితంగా పరిపాలన అందిస్తానన్నారు. ప్రధానంగా సామర్లకోట, పెద్దాపురం పట్టణాలకు తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో దొరబాబు సతీమణి చంద్రకళ, కుమార్తె సార్విక, తండ్రి దవులూరి సుబ్బారావు, రాష్ట్ర అయ్యర్క కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ ఆవాల రాజేశ్వరి, పార్టీ ఎన్నికల పరిశీలకులు చీకట్ల కిషోర్‌ పాల్గొన్నారు.

➡️