‘ఇండియా’ అభ్యర్థులను గెలిపించండి

Apr 26,2024 23:02
సార్వత్రిక ఎన్నికల్లో ఇం డియా

ప్రజాశక్తి – పెద్దాపురం

సార్వత్రిక ఎన్నికల్లో ఇం డియా కూటమిలో ఉన్న పార్టీల అభ్య ర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో సిపిఎం పెద్దాపురం మండల కార్య దర్శి నీలపాల సూరిబాబు అధ్యక్షతన సిపిఎం మం డల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముందు సిపిఎం ఎన్నికల ప్రణాళిక కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనం తరం ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన మతతత్వ బిజెపిని, ఆ పార్టీతో జత కట్టిన టిడిపి, జనసేన కూటమిని, నిరం కుశ పాలన అందించిన వైసిపిని ఈ ఎన్ని కల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో సిరపరపు శ్రీనివాస్‌, గడిగట్ల సత్తి బాబు, యాసలపు రమేష్‌, గరగపాటి పెంట య్య, దారపురెడ్డి కృష్ణ, రొంగల వీర్రాజు, సుబ్బలక్ష్మి, చల్లా విశ్వనాథం పాల్గొన్నారు.

➡️