ఎన్నికల్లో టిడిపి విజయం కోసం పాదయాత్ర

Mar 6,2024 16:34

పాదయాత్ర ప్రారంభిస్తున్న చింతలూరు టిడిపి నేతలు

ప్రజాశక్తి-ఆలమూరు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి విజయం సాధించి చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని, కొత్తపేట ఎంఎల్‌ఎగా బండారు సత్యానంద రావు ఘన విజయం సాధించాలని కోరుతూ చింతలూరు నుంచి వాడపల్లి వరకు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. యువ నాయకుడు నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ పాదయాత్రను చేపట్టినట్లు చింతలూరు ఫణీంద్ర కుమార్‌ తెలిపారు. బాణాసంచా కాల్పుల మధ్య యువ ఉత్సాహంతో పాదయాత్ర సాగించారు.కార్యక్రమంలో గ్రామ టిడిపి అధ్యక్షుడు వైట్ల గంగరాజు, సీనియర్‌ నాయకుడు వైట్ల శేషుబాబు, టిడిపి రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి దండంగి మమత, మాజీ సర్పంచ్‌ వాకా సుబ్బలక్ష్మి, దొమ్మేటి రామకష్ణ, శివన్నారాయణ, బుంగ శ్రీను, చనుమోలు గణేష్‌ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

➡️