ఓటర్ల దినోత్సవంపై అవగాహన

Jan 25,2024 17:08

అమలాపురంలో ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తదితరులు

ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో అవగాహన ర్యాలీలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ సిటిజన్‌లను సత్కరించారు. కొత్తగా నమోదైన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు అందజేశారు. వివిధ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహమమతులు అందజేశారు. ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాల్లో అధికారులు తదితరులు పాల్గొని ఓటు ప్రాముఖ్యతను వివరించారు.

ప్రజాశక్తి-

స్థానిక భట్లపాలెం బివిసి కళాశాల నందు14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లామాట్లా డుతూ ఏడాది ఓటర్‌ దినోత్సవం యొక్క ఉద్దేశం నేను కచ్చితంగా ఓటు వేస్తాననే అంశంపై నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని. ప్రజాస్వా మ్య విలువల్ని పెంపొందించుకోవాలన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు మాట్లాడుతూ నూతనంగా నమోదైన ఓటర్లులో ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ పట్ల నిబద్దత పెంచడానికి ఈ ఉత్సవం దోహద పడుతుందన్నారు. రంగోలి ముగ్గుల పోటీలు ఓటర్‌ దినోత్సవం పై చక్కని సందేశం విద్యార్థినీ విద్యార్థులు అందించా రన్నారు తొలుతగా ఓటరు దినోత్సవ ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించారు. చివరగా సీనియర్‌ సిటిజన్స్‌ ఓటర్ల లను సత్కరించి కొత్తగా నమోదైన ఓటర్లకు ఫోటో ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. రంగోలి, వ్యాసరచన వక్తత్వపు పోటీల్లో విజేతలకు బహుమ తులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ జి.కేశవర్ధన్‌ రెడ్డి, ఎడ్మిన్‌ ఎస్పీ ఎస్‌ ఖాదర్‌ బాషా, వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ విఐపి నాయుడు, డిఎస్‌పి ఎం.అంబికా ప్రసాద్‌, ప్రిన్సిపల్‌ జెవిజె రామా రావు, సంసాని నాని కళాశాల నోడల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మండపేట 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని తహశీల్దార్‌ టిఆర్‌. రాజేశ్వరరావు, మున్సిపల్‌ కమిషనర్‌ టి.రామకుమార్‌ అన్నారు. స్థానిక తాసిల్దార్‌ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలువ పువ్వు సెంటర్లో మనోహరం చేపట్టి మున్సిపల్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కోన అప్పారావు, మున్సిపల్‌ మేనేజర్‌ తాతపూడి కనకరాజు, ఎలక్షన్‌ డిటి మెహర్‌ బాబా, ఎఫ్‌డిఒ రమణ రావు తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం స్థానిక దేవి సెంటర్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థినిలకు నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు తొలిత విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు. కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన సీనియర్‌ సిటిజన్లను ఘనంగా సత్కరించారు .అనంతరం ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే డిటి పి.శ్రీరామ్‌ ప్రసాద్‌, విఆర్‌ఒ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు .

 

➡️