మౌలిక సదుపాయాలకు సిఎం పెద్దపీట

Mar 11,2024 23:17
మౌలిక సదుపాయాలకు సిఎం పెద్దపీట

ప్రజాశక్తి-ఉప్పలగుప్తంరాష్ట్రంలో అభివద్ధి సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాలకు సిఎం జగన్‌ పెద్దపీట వేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. గోపవరం, చల్లపల్లి, కిత్తనచెరువు గ్రామాల్లో సర్పంచ్‌లు కుంచే బుల్లియ్య (బాబారు), ఇసుకపట్ల జయమణి, కుంచే గౌరి అధ్యక్షతన సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి విశ్వరూప్‌ పాల్గొన్నారు. చల్లపల్లిలో జిజిఎంపి నిధులు రూ.కోటీ 20 లక్షలతో పలు సిసి రోడ్లను ప్రారంభించారు. పలు రోడ్లకు శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలనా ఆవిష్కరించారు. అదే గ్రామంలో రూ.26 లక్షలతో నిర్మించనున్న ఒహెచ్‌ఎస్‌ఆర్‌ వాటర్‌ ట్యాంక్‌కు మంత్రి విశ్వరూప్‌ శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గోపవరం, కూనవరం గ్రామాల్లో ఒక్కొక్కటీ రూ.23.94 లక్షలతో నిర్మించిన రెండు రైతు భరోసా కేంద్రాలను గోపవరంలో రూ.43.60 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి విశ్వరూప్‌ ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. చల్లపల్లి తూర్పుపేటలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు డ్రైన్‌ను కూడా మంత్రి విశ్వరూప్‌ ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి విశ్వరూప్‌కు ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. చల్లపల్లిలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంగేటి రాంబాబు ఆధ్వర్యంలో మంత్రి విశ్వరూప్‌కు పూలవర్షం కురిపించి మేళ తాళాలతో ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి పేద ప్రజల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న సిఎం జగన్‌ను మరోమారు సిఎంగా చేసుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిపి దంగేటి వీర అచ్యుత జానకి, వైస్‌ ఎంపిపి సాదే శ్రీనివాసరావు, జెడ్‌పిటిసి గెడ్డం సంపదరావు, సర్పంచ్‌ యర్రంశెట్టి రామచంద్రరావు, ఎంపిటిసిల సమాఖ్య మండల అధ్యక్షుడు పెట్టా అప్పారావు, ఎంపిటిసిలు కొంకి ఏడుకొండలు, కాట్రు ధనలక్ష్మి, వంగా గిరిజా కుమారి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంగేటి రాంబాబు, ఎఎంసి వైస్‌ చైర్మన్‌ బడుగు మేరీ కుమారి, డైరెక్టర్‌ చప్పిడి దుర్గారావు, మాజీ ఎంపిటిసి కోరుకొండ మంగాయమ్మ, వైసిపి మండల అధ్యక్షుడు బద్రి బాబ్జి, కార్యదర్శి పినిపే జయరాజు, వ్యవసాయ సలహా మండలి మండల చైర్మన్‌ మానే శ్రీను, సొసైటీల అధ్యక్షులు దంగేటి దొరబాబు, నడింపల్లి వాసురాజు, అడపా రమేష్‌, ఊటాల రామాంజనేయులు, చిక్కం బాలయ్య, ఓగూరి విజరు కుమార్‌, కోటుం లోవరాజు, ఎంపిడిఒ కెవి.ప్రసాద్‌, ఇఒపిఆర్‌డి కెఎస్‌.గౌరీకుమారి పాల్గొన్నారు.

➡️