వాలంటీర్లకు పురస్కారాలు ప్రదానం

Feb 15,2024 23:22

వాలంటీర్లకు పురస్కారం అందజేస్తున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తదితరులు

ప్రజాశక్తి-అమలాపురం

స్థానిక కలెక్టరేట్లో వాలంటీర్లకు అభినందన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం నందు సిఎం జగన్‌ వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం స్థానిక కలెక్టరేట్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో విధి నిర్వ హణలో విశేష ప్రతిభ కనబరిచిన ఐదుగురికి సేవా వజ్ర అవార్డులు ప్రకటించి ఒక్కొక్కరికి రూ.45 వేలు చొప్పున అవార్డును ప్రశంసాపత్రాన్ని మెడల్‌ను ద్వారా పురస్కరించే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ప్రారంభించారు. అదేవిధంగా ప్రతి మండలం, మున్సిపా లిటీ నుంచి ఐదుగురిని ఎంపిక చేసి సేవారత్న పురస్కారంగా రూ.30 వేలు నగదును, మెడల్‌ ను, మిగిలిన వాలం టీర్లు అందరికీ సేవా మిత్ర కింద రూ.15 వేల నగదు అవార్డును ప్రశంసా పత్రాన్ని మెడల్‌ ను బహుకరించి సత్కరిం చారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ప్రతి ఏడాది పురస్కారాలను అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ వాలంటీర్లను వందనం పేరుతో సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఈ కార్యక్రమం ఈనెల 22 వరకు ఎంఎల్‌ఎల ఆధ్వ ర్యంలో జరుగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా సేవా మిత్ర అవార్డులు 9,417 మంది వాలంటీర్లకు, సేవారత్న పురస్కారాలు130 మంది వాలంటీర్లకు, సేవా వజ్ర పుర స్కారాలు 34 మంది వాలంటీర్లకు వెరసి 9,581 వాలంటీర్లు రూ.14 కోట్ల 66 లక్షల 85 వేలు మేర పురస్కారాల ద్వారా లబ్ధి పొందారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి బొమ్మి ఇజ్రాయిల్‌, గ్రామ వార్డు సచివాలయం నోడల్‌ అధికారి కే భీమేశ్వరరావు, బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు పికె.రావు, హితకారిణి సమాజం చైర్మన్‌ కాశీ బాలమునికుమారి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఖాదర్‌, దృశ్యకళల అకాడమీ చైర్మన్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.

 

➡️