హోరాహోరీగా అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

Apr 8,2024 22:42
హోరాహోరీగా అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

ప్రజాశక్తి-యంత్రాంగం పలు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు సోమవారం ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాట్రేనికోన టిడిపి ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు దొంతుకుర్రు, పల్లంకుర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట గుత్తుల సాయి, చెల్లి అశోక్‌, నడింపల్లి సుబ్బరాజు, నాగీడి నాగేశ్వరరావు, సర్పంచులు సీతారామరాజు, చెల్లి సురేష్‌, రంబాల రమేష్‌, జొన్నాడ రాజారావు, మాదే యోగేశ్వరి, విత్తనాల బుజ్జి, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రామచంద్రపురం ఏరుపల్లిలో వైసిపి అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్‌ ప్రచారం చేపట్టారు. ఉప్పలగుప్తం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, వైసిపి అమలాపురం అభ్యర్థి పివిపే విశ్వరూప్‌చల్లపల్లి పంచాయతీ జగ్గరాజుపేటలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. తొలుత అంబేద్కర్‌ విగ్రహానికి మంత్రి విశ్వరూప్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట ఎంఎల్‌సి బొమ్మి ఇజ్రాయిల్‌, సర్పంచుల సమాఖ్య మండల అధ్యక్షుడు కడిమి చిన్నవరాజు, సర్పంచులు కుంచే బుల్లియ్య, యర్రంశెట్టి రామచంద్రరావు, పెయ్యల రాజ్‌కుమార్‌, జెడ్‌పిటిసి గెడ్డం సంపదరావు, పందిరి శ్రీహరి, వైస్‌ ఎంపిపి సాదే శ్రీనివాసరావు, ఎంపిటిసిల సమాఖ్య మండల అధ్యక్షుడు పెట్టా అప్పారావు, ఎంపిటిసిలు వంగా గిరిజ కుమారి, కొంకి ఏడుకొండలు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంగేటి రాంబాబు, పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు బద్రి బాబ్జి, పినిపే జయరాజు, వ్యవసాయ సలహా మండలి మండల చైర్మన్‌ మానే శ్రీను, ఓగూరి విజయకుమార్‌, యనమదల పల్లంరాజు పాల్గొన్నారు.

➡️