సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌

Apr 5,2024 22:34

ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్న పోలీసు బృందాలు

ప్రజాశకి-అమలాపురం

అమలాపురం సబ్‌ డివిజన్‌ ఐ.పోలవరం పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని గోగుల్లంక, భైరవలంక గ్రామాల్లో సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్‌ లు, సమస్యాత్మక గ్రామాల్లో స్థానిక పోలీసులు కేంద్ర బలగాలు సంయుక్తంగా ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించి ఎన్నికల విషయమై ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకొనుటకు ప్రజలకు భరోసా కల్పించినారు. అవగాహన కార్యక్రమం నిర్వహించినారు. కొత్తపేట సబ్‌ డివిజన్‌ పి.గన్నవరం పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని నాగుల్లంక మానేపల్లి గ్రామాలలో సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్‌లు, సమస్యాత్మక గ్రామాలలో స్థానిక పోలీసులు కేంద్ర బలగాలు సంయుక్తంగా ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించి ఎన్నికల విషయమై ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు భరోసా కల్పించారు. అవగాహన కల్పించారు.

 

➡️