వలస ఓటర్లకు గాలం

Apr 28,2024 23:07
వలస ఓటర్లకు గాలం

ప్రజాశక్తి-రాజోలు వచ్చే నెల 13న జరగనున్న శాసనసభ, లోక్‌ సభ ఎన్నికల్లో గెలిచేందుకు పోటీలో ఉన్న పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు శత విధాలా ప్రయాత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో కీలకం కావడం, పదులు, ఒకట్ల తేడాతోనే గెలుపోటములు ఉండడంతో ఓటరు లిస్టులో పేరున్న ప్రతి ఓటరు వద్దకు వెళుతున్నారు. వలస పోయిన వారి అడ్రస్‌ తెలుసుకుంటూ ఫోన్లు చేస్తున్నారు. పోలింగ్‌ కల్లా వచ్చి ఓటేస్తే రానుపోను ఖర్చులు భరిస్తామంటూ చెబుతున్నారు. వారు వచ్చేలా స్థానికంగా ఉన్న బంధువులతో మాట్లాడుతున్నారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయితీ ఆయా వార్డుల్లో ఓటు ఉండి వలస పోయిన ఓటర్లకు గాలం వేస్తున్నారు. రెండు, మూడు నెలల కింద ఇతర ప్రాంతాలు, పట్టణాలకు వలస వెళ్లిన వారి వివరాలను ఓటరు లిస్ట్‌లతో సేకరిస్తున్నారు. 13న జరిగే పోలింగ్‌ కోసం రావాలంటూ అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారు. రాను పోను ఛార్జీలు తామే భరిస్తామని హామీలు గుప్పిస్తూ ఎంతకైనా ఖర్చుకు వేనకాడేది లేంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. తాను గుర్తింపు పొందిన పార్టీ నుంచే బరిలో ఉన్నామంటూ వారి బంధువుల ద్వారా ఫోన్‌ చేయించి వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.2000 ఖర్చు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. తమ బంధువుల ద్వారా ఫోన్‌ వివరాలు సేకరిస్తూ ఎవరు చెపితే ఓటు వేస్తారో వారితో చెప్పించి మరీ ఫోన్‌లు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లను రప్పించేందుకు కొంత డబ్బును వారి ఇంట్లో ముట్టజెపుతూ ఓటు వేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటరుగా ఉన్న వ్యక్తి ఎవరితో చెప్పిస్తే వింటాడో వారి ద్వారా ఫోన్‌ చేయిస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎంతకైనా తెగించి మద్యం, డబ్బు ఎర చూపుతున్నారు. డ్వాక్రా గ్రూపులకు, కుల సంఘాలకు పెద్ద ఎత్తున నజరాలను ముట్టజెప్పే ప్రయత్నంలో ఉన్నారు. అధికార పార్టీ మినహా ఇతర పార్టీల అభ్యర్థులు కూడా తామేమీ తక్కువ కాదని ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాను తప్పనిసరి గెలిచేందుకు అవకాశాలు న్నాయని కుటుంబ సభ్యులతో ఫోన్‌లు చేయిస్తూ ఓటేయాలంటూ వేడుకుంటున్నారు. దీని కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 5 ఓట్లకు పైబడి ఉంటే ప్రత్యేక వాహనం కూడా ఏర్పాటు చేస్తామని వచ్చి ఓటు వేయాలంటూ వేడుకుంటున్నారు. వలస వెళ్లిన వారి ఓటు తీసేయకుండా జాగ్రత్త పడుతూ ఓట్లు తొలగించకుండా తానే చూసానని, తప్పకుండా తనకు ఓటు వేయాలని ఫోన్‌ చేసి అర్ధిస్తున్నారు. కుల పెద్దల వారికి ఫోన్‌లు చేయించి కుల కట్టుబాటు దాట వద్దంటూ సూచిస్తున్నారు. ఎన్నికలకు ముందు రోజు రావాలని వెడుకుండున్నారు. ఆయా వార్డులో ఒక్కోక్క ఓటు కీలకం కావడంతో ఓటరు జాబితా సేకరించి ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో సమాచారాన్ని సేకరిస్తున్నారు. మీరు సిద్దం కండి మేం చూసుకుంటాం.!విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం చాలామంది తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, దిల్లీ తదితర రాష్ట్రాలకు అనేక మంది వెళ్లారు. ఇక మన రాష్ట్రంలోనే తిరుపతి, నెల్లూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో ఎంతోమంది ఉంటున్నారు. అలాంటి వారికి అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారు. అక్కడి నుంచి మీరంతా రండి. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మేమే చూసుకుంటాం. రవాణా ఖర్చులు భరిస్తామంటూ ఇప్పటికే కబురు పంపించారు. కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకొని పిలిపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఎలాగైనా ఓటేసి రావాలన్న తలంపుతో చాలామంది రావడానికి సుముఖత చూపుతున్నారు. ఇప్పటి నుంచి బస్సు, రైలు, విమాన ప్రయాణం కోసం రిజర్వేషన్‌ ఖరారు చేసుకుంటున్నారు. మరోవైపు ఒకే ప్రాంతంలో ఎక్కువమంది ఉంటే ప్రత్యేక వాహనాలు ఏర్పాట్లు చేస్తామని అభ్యర్థులు, నాయకులు కబురు పెడుతున్నారు. దీంతో చాలామంది సొంతూళ్లకు వస్తున్నట్లు గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. వలస ఓటర్లంతా పల్లెటూర్లకు చేరుకుని

➡️