వేగుళ్ళను అభినందించిన ఆలమూరు నేతలు

Jun 7,2024 15:10 #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు : వరుసగా నాలుగవ విజయంతో మండపేట ఉమ్మడి టిడిపి శాసనసభ్యునిగా ఎన్నికైన వేగుళ్ళ జోగేశ్వరరావును శుక్రవారం ఆలమూరు తెలుగుదేశం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలతో ముంచెత్తారు. ఆయనను మండల కేంద్రంలోని తెలుగుదేశం కార్యాలయం వద్దకు ఆహ్వానించి బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఈదల నల్లబాబు, ఈదల సత్తిబాబు, ఈదల రాంబాబు, లంక శ్రీరాములు, బొబ్బా రాంబాబు, జల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

➡️