తెలుగు జాతి చరిత్రలో ఎన్టీఆర్ స్థానం అజరామరం

Jan 18,2024 11:07 #Konaseema
ntr death anniversary in konaseema

ప్రజాశక్తి – ఆలమూరు : తెలుగు జాతి చరిత్రలో ఎన్టీఆర్ స్థానం అజరామరమని, చిరస్మరణీయమని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు నినదించారు. నటునిగా, రాజకీయ నాయకునిగా, ముఖ్యమంత్రిగా, ఆయన తెలుగుజాతికి అందించిన సేవలు భారత దేశ చరిత్రలో తెలుగు వారి ఖ్యాతిని ఇనుమడింపచేశాయని వారన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గురువారం మండలంలోని చొప్పెల్ల ఏఆర్కే ప్లాజా ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఆలమూరు బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే పెనికేరు, పెదపల్ల సెంటర్లో ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పుష్పాంజలి ఘటించారు. జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు.

➡️