‘పుచ్చలపలి’్ల ఆశయ సాధన కృషి

May 19,2024 21:06

అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో పుచ్చలపల్లి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ప్రజాసంఘా లనాయకులు తదితరులు

ప్రజాశక్తి-యంత్రాంగం

స్వాతంత్య్ర సమరయోధుడు పార్లమెంటులో తొలి ప్రతిపక్షనేత, త్యాగశీలి, మహానేత పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం ఆయన 39వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు ప్రజాసంఘాల నాయకులు, యుటిఎఫ్‌ నేతలు తదితరులు అమలాపురం : మహానేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ స్ధానిక ప్రజాసంఘాల కార్యాలయంలో నిర్వహించారు. ఈ సభకు సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు అండ్రామాల్యాద్రి హాజరై మాట్లాడుతూ సుందరయ్య జీవిత ఆశయాలను మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టితన యావదాస్ధిని ప్రజలకోసం ప్రజా ఉద్యమాలకోసం త్యాగం చేసారని గుర్తు చేశారు. పిల్లలు పుడితే ప్రజాఉద్యమాలకు ఆటంకంగా ఉంటారనే ఆలోచనతో పిల్లలను వద్దనుకున్న మహనీయుడు సుందరయ్యని గుర్తు చేశారు. నేడు దేశాన్ని పరిపాలన చేస్తున్న బిజేపి దేశాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెడుతోందని విమర్శించారు. సుందరయ్య పార్లమెంటుకు సైకిల్‌ పై వెళ్ళి ఆదర్శ మూర్తిగా నిలిచారన్నారు. ఎన్నికలు వ్యాపారంగా మార్చిన నేపథ్యంలో సుందరయ్య ఆచరణలో ప్రజానాయకుడు ఎలా ఉండాలో చూపించారని అన్నారు. ఎపి లో జరిగిన ఎన్నికల్లో పోటీ పడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీలు గుప్పించారే తప్ప ఉపాధి కల్పనకోసం ఏచర్యలు చేస్తారో ప్రజలకు బిజెపి, టిడిప,ి వైసిపి లు చెప్పలేదన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్పొరేట్‌ ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్న. బిజేపీ మతోన్మాద విధానాలపై సుందరయ్య చూపిన మార్గంలో పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి.దుర్గాప్రసాద్‌, పీతల రామచంద్రరావు, సఖిలే సూర్యనారాయణ, పాము బాలయ్య, తాడి శ్రీరామ్‌మూర్తి, కెవి.సత్యనారాయణ, తాళ్ళూరి శ్రీనివాసరావు, విప్పర్తి మోహన్‌రావు, కె.శంకర్‌ పర్వతాలు, జగడం నాగేశ్వరరావు, కె.సత్తిబాబు, సిహెచ్‌.సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారుపండ్ల పంపిణీ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా యుటిఎఫ్‌, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో స్థానిక అమలాపురం ఏరియా హాస్పిటల్‌ నందు రోగులకు వద్ధులకు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ జ్యోతిబసు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య దేశం గర్వించదగిన ఆదర్శ నాయకుడన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివద్ధి కోసం అనేక సూచనలు సలహాలు చేసిన వ్యక్తిని అని అన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడని కొనియాడారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా పండ్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పెంకే వెంకటేశ్వరరావు, ఎంటివి.సుబ్బారావు, కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గాప్రసాద్‌, యుటిఎఫ్‌ నాయకులు జి.సురేంద్ర, మురళీ, శివకుమార్‌, బిఎన్‌.వెంకటేశ్వరులు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. రాజోలు: పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని స్థానిక రాజోలు అంబేద్కర్‌ భవనంలో సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటి సభ్యులు పీతల రామచంద్రరావు మాట్లాడుతూ, నేడు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలి, నేటి యువతరానికి ఆయన ఒక స్ఫూర్తిదాయకమన్నారు. సమాన పనికి సమాన వేతనం సాధించగలిగినప్పుడు, రైతులకు గిట్టుబాటు ధర సాధించుకోగలిగినప్పుడు, వ్యవసాయ కార్మికులకు కనీస కూలి గిట్టుబాటు దొరికినప్పుడు, పేద ప్రజలందరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సాధించగలిగినప్పుడే సుందరయ్యకు నిజమైన నివాళి అని అన్నారు. అనంతరం పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయుకులు తాడి శ్రీరాముర్తి, కారుపల్లి గోపాల్‌, బళ్ల పర్వతాలు, పి.రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. మండపేట: పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని మండపేట పట్టణంలో సిఐటియు ఆధ్యర్యంలో నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణ వేణి ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా సుందరయ్య పోరాట పటిమను గుర్తు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండపేట పట్టణ శాఖ సభ్యులు కె.నరేంద్ర, సిహెచ్‌.రాణి, ఎం.సుగుణ, కె.రత్నం తదితరులు పాల్గొన్నారు. ఉప్పలగుప్తం: ఉప్పలగుప్తం పంచాయితీ కోటుం వారిపేటలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సిఐటియు నాయకురాలు పి.బేబీ గంగారత్నం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఉపాధి కూలీలకు బేబీ గంగా రత్నం ఆమె కుటుంబ సభ్యులు మజ్జిగను అందజేశారు. ముమ్మిడివరం: నగర పంచాయతీ పరిధిలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పాము బాలయ్య అధ్వర్యంలో ఆదర్శనేత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిఐటియు మండల కార్యదర్శి నిమ్మకాయల వెంకటేష్‌ పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సుందరయ్య పేదల అభ్యున్నతికి కృషి చేసిన ఆదర్శనేత అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో దొమ్మేటి వీర రాఘవులు, లక్ష్మీ, పలువురు పాల్గొన్నారు.

అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో పుచ్చలపల్లి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ప్రజాసంఘా లనాయకులు తదితరులు

➡️