ఆర్డిఓ ఆదేశాలతో ఫ్లెక్సీల తొలగింపు 

Mar 17,2024 13:49 #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం : ఎన్నికల నేపథ్యంలో శనివారం నోటిఫికేషన్ జారీ కాగా రామచంద్రపురం ఆర్టీవో సుదా సాగర్ అన్ని గ్రామాల్లోనూ మెయిన్ రోడ్ లోనూ ఉన్న ఫ్లెక్సీలు తొలగించాలని ఎన్నికల నిబంధనలను పాటించాలని సూచించారు. అయితే కే గంగవరం మండలంలోని కోటిపల్లి రేవులో ఫ్లెక్సీలు అధిక సంఖ్యలో ఉండటంతో ఆదివారం కోటిపల్లి రేవు మీదుగా అమలాపురం వెళ్లిన ఆర్డీవో వాటిని గమనించి వెంటనే తొలగించాలని సూచించారు. పంచాయతీ సిబ్బంది పోలీసులు సహకారంతో రేవులో గల ఫ్లెక్సీలను వెంటనే తొలగించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు తప్ప మిగిలిన విగ్రహాలకు ముసుగులువేయాలని అన్ని ప్రాంతాల్లో గల ఫ్లెక్సీలు తొలగించాలని ఈ సందర్భంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆర్డిఓ సూచించారు.

➡️