ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి 

Apr 10,2024 15:36 #Konaseema

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అంగర పీహెచ్ సి వైద్యాధికారిణి డా. జె అనూజా ప్రియాంక అన్నారు . ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కపిలేశ్వరపురం మండలంలోని అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం వైద్యాధికారిణి డా. అనూజా ప్రియాంక ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 25 మంది గర్భిణీ స్త్రీలకు వైద్యపరీక్షలు నిర్వహించారు .వారిలో హైరిస్క్ గర్భిణీ స్త్రీలను 6 మందిని గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు ,లేబరేటరీ పరీక్షలు జరిపి వారికి మందులను అందజేశారు . అనంతరం గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల పాటించవలసిన నియమాలు, జాగ్రత్తలు, గర్భిణీలు తీసుకోవలసిన పౌష్టికాహారం , ఆసుపత్రిలో ప్రసవాల ప్రాముఖ్యత, ప్రభుత్వం ద్వారా కలిగే ప్రయోజనాలు, తదితర వాటిపై ఎంపీ హెచ్ ఈ ఓ జె మల్లికార్జునుడు, హెల్త్ ఎడ్యుకేటర్ బి రామారావు , వివరించారు. కార్యక్రమంలో ఎం పి హెచ్ ఈ ఒ జె మల్లికార్జునుడు, హెల్త్ ఎడ్యుకేటర్ బి రామారావు, హెచ్ వి టి.మేరీ మణి, ఏఎన్ఎంలు, వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు,గర్భిణీలు, పాల్గొన్నారు.

➡️