ఎన్నారై ‘రాయుడు’కు ఉగాది నంది పురస్కారం

Apr 13,2024 23:04

పురస్కారం స్వీకరిస్తున్న రాముడు వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-ఆలమూరు

చెముడు లంకకు చెందిన ఎన్నారై (బెహ రాన్‌)రాయుడు వెంక టేశ్వరరావుకు ఉగాది నంది పురస్కారం స్వీకరించారు. శనివారం ఫిలాంత్రోఫిక్‌ సొసైటీ ఆధ్వర్యంలో రాజ మహేంద్ర వరంలో ఉగాది జాతీయ నంది పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. బెహరాన్‌ ల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న రాయుడు జన్మభూమి మీద ఉన్న మమకారంతో ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుం టారు. వివిధ ప్రాంతాలలో స్థిరపడిన ఎన్నారైల సహకారంతో చెముడులంకలో స్థానిక హైస్కూల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌, గ్రామంలో ఆర్‌ఒ వాటర్‌ ప్లాంట్‌ వంటి ఏర్పాటుచేశారు రాయుడు సేవలను గుర్తించిన పిలాన్‌ త్రోపిక్‌ సొసైటీ 2024 ఉగాది నంది పురస్కారానికి ఎంపిక చేసి ఈ అవార్డును అందజేశారు. రాయుడుకు ఉగాది నంది పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి రెడ్డి, శ్రీశ్రీ కళాఅకాడమి జాతీయ అధ్యక్షుడు కత్తిమండ ప్రతాప్‌, కేంద్ర సంగీత నాట్య అకాడమీ చైర్మన్‌ ఎస్‌పి భారతి, ఫిలాన్త్రోఫిక్‌ సొసైటీ వ్యవస్థాపకులు అద్దంకి రాజా చేతుల మీదుగా స్వీకరించారు. వెంకటేశ్వ రరావును పలువురు అభినందించారు.

 

➡️