మేడే ఘనంగా నిర్వహించాలి

Apr 21,2024 23:19

ప్రజాశక్తి-గుడివాడ 

కార్మికుల సాధన కోసం ఏర్పడిన ఏఐటియసి కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తుందని ఏఐటియుసి జిల్లా కన్వీనర్‌ టి.తాతయ్య అన్నారు. ఆదివారం స్థానిక ఏలూరురోడ్డులోని ఏఐటియుసి కార్యాలయంలో శేషుబాబు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తాతయ్య మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల పర్వదినం మేడే వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ప్రపంచ కార్మికులు హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించుకోవడం వల్లే కొన్ని హక్కులను సాధించుకోవడం జరిగిందన్నారు. మేడే రోజున కార్మికుల హక్కుల కోసం మళ్ళి పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో యూనియన్‌ గౌవర అధ్యక్షులు గూడపాటి ప్రకాష్‌బాబు, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ సత్యనారాయణ, కార్మిక సంఘాల నాయకులు రామకష్ణ, వెంకన్న, దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️