కూటమితోనే ప్రగతి సాధ్యం : మండలి

Apr 21,2024 23:21

ప్రజాశక్తి-అవనిగడ్డ

అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ పులిగడ్డ గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి టిడిపి జనసేన బిజెపి కూటమి విజయంతోనే రాష్ట్రంలో ప్రగతి సాధ్యం అంటూ ప్రచారం నిర్వహించారు. బందరు జనసేన పార్లమెంట్‌ అభ్యర్థిగా బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు గాజు గ్లాస్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, కర్ర సుధాకర్‌, ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి గుంటూరు వినరు బాబు, టిడిపి సీనియర్‌ నాయకులు చెన్ను బాబురావు తదితరులు పాల్గొన్నారు.అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌ను గెలిపించి ఉత్తమ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని తెలుగు భాషా ఉద్యమ సమైక్య అధ్యక్షులు సామల లక్ష్మణబాబు విజ్ఞప్తి చేశారు. ఆదివారం బుద్ధప్రసాద్‌ను లక్ష్మణ బాబు కలిసి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2003లో తెలుగు భాష ఉద్యమ సమైక్యను ప్రారంభించడం జరిగిందని, 20 ఏళ్లుగా మండలి బుద్ధ ప్రసాద్‌తో కలసి తెలుగు భాష కోసం పోరాటం చేస్తున్నామన్నారు. తెలుగు భాషలోనే పరిపాలన జరగాలని మాతృభాషలోనే బోధన జరగాలని తమ ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ, ఎర్రంశెట్టి హనుమంతరావు పాల్గొన్నారు.

➡️