ఎన్నికల బాండ్ల విధానాన్ని రద్దు చేయాలి

Mar 11,2024 12:08 #Krishna district

 సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్(ఐ) డిమాండ్
ప్రజాశక్తి-కలక్టరేట్ ( కృష్ణా) : తక్షణమే ఎన్నికల బాండ్లు వివరాలు సమాచారం అందజేయవలసిందిగా సిపిఎం పార్టీ మచిలీపట్నం నగర కార్యదర్శిబూర. సుబ్రహ్మణ్యం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.సోమవారం స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద ఎన్నికల బాండ్ల వివరాలు వెంటనే అందజేయాలని కోరుతూ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ ఐ, మచిలీపట్నం కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, ఆ సమాచారం అందజేయాలని దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందన్నారు. దేశంలో అత్యున్నతమైన, అతి పెద్ద డిజిటలైజేషన్ కలిగిన, దాదాపు 48 కోట్ల ఖాతాలు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కానీ మాకు జూన్ 30 వరకు గడువు కావాలంటూ దరఖాస్తు చేయటం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ మతిన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు రాకుండా కాపాడేందుకు ఎస్ బి ఐ ఒక కవచంలా వ్యవహరిస్తుడం సరైనది కాదన్నారు. అతి పెద్ద డిజిటలైజేషన్ కలిగిన సంస్థ ఎస్బిఐ అని రాతపూర్వ కంగా భద్రపరిచామని సాకు చూపించి గడువు కోరటం హాస్యాస్పదమని సిపిఐ జిల్లా నాయకులు మోదుమూడి రామారావు అన్నారు.బాండ్లు ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి మధ్య క్విడ్ ప్రోకో( నీకిది -నాకది) అనే బాగోతం నడిచిందని కొన్నిసార్లు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించటానికి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ బాండ్ల ఉన్నాయని సుప్రీంకోర్టు తీర్పు కనుగుణంగా బాండ్లను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రాజేష్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులుకొడాలి శర్మ, సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్ జయరావు కమిటీ సభ్యులు
ఎం.డియునస్, సిపిఐ మచిలీపట్నం నియోజకవర్గం కార్యదర్శి లింగం పిలిప్, నాయకులు వై ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోకా పణి భూషణ్, ఎన్ కుమారి తదితరులు పాల్గొన్నారు.

➡️