క్రీడలతో మానసికోల్లాసం

Jan 10,2024 20:39

క్రీడలను ప్రారంభిస్తున్న సర్పంచి రాధమ్మ

– సర్పంచి రాధమ్మ
ప్రజాశక్తి – ఆస్పరి
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని సర్పంచి మూలింటి రాధమ్మ, కెడిసిసి బ్యాంకు డైరెక్టర్‌ రాఘవేంద్ర, వైసిపి మండల మాజీ కన్వీనర్‌ రామాంజనేయులు తెలిపారు. బుధవారం ‘ఆడుదాం ఆంధ్ర’లో భాగంగా ఆస్పరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎంపిడిఒ రాణెమ్మ అధ్యక్షతన మండల స్థాయి క్రీడ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికి తీసేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ‘ఆడుదాం ఆంధ్ర’ చేపట్టారని తెలిపారు. గెలుపోటములు సహజమని, అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి క్రీడలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎంఇఒ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️