పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

Jan 10,2024 20:44

హోళగుందలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి

– కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఎస్‌పి.సింగ్‌ బఘేల్‌
ప్రజాశక్తి – నందవరం
పేదల అభివృద్ధి, సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఎస్‌పి.సింగ్‌ బఘేల్‌ తెలిపారు. బుధవారం నందవరంలో ఎంపిడిఒ దశరథ రామయ్య, సర్పంచి సావిత్రిల ఆధ్వర్యంలో భారత్‌ వికసిత్‌ సంకల్ప యాత్ర చేపట్టారు. మంత్రి ఎస్‌పి.సింగ్‌ బఘేల్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం, వ్యవసాయ, వైద్య, ఆరోగ్యశాఖ, ఇరిగేషన్‌, గృహ నిర్మాణ శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించే పిఎం కిసాన్‌, కిసాన్‌ సమృద్ధి యోజన, జల జీవన్‌ మిషన్‌, ఉజ్వల గ్యాస్‌ సిలిండర్‌, ఉచిత బియ్యం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, విద్యుత్‌, మరుగుదొడ్లు, ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్యశ్రీ పథకాల గురించి వివరించారు. అనంతరం మంత్రిని ఘనంగా సన్మానించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఉజ్వల గ్యాస్‌ సిలిండర్లు, మంజూరు పత్రాలను ఆయన చేతుల మీదుగా అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలు ప్రదర్శించిన కళా నృత్య ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివ నారాయణ శర్మ, డిఇఒ రంగారెడ్డి, డిఆర్‌డిఎ పీడీ సలీం బాష, జడ్‌పి సిఇఒ నాసర రెడ్డి, డిఎల్‌పిఒ నాగరాజ్‌ నాయుడు, జిఆర్‌బి ఎస్‌ఇ రాజశేఖర్‌ రెడ్డి, డిఎంహెచ్‌ఒ రామ గిడ్డయ్య, డిస్ట్రిక్‌ సర్వేయర్‌ శ్రీనివాసరాజు, హౌసింగ్‌ ఇఇ రవికుమార్‌, జిల్లా పశుసంవర్థక శాఖ జెడి రామచంద్రయ్య, సర్పంచి సావిత్రి, ఎంపిడిఒ దశరథ రామయ్య, ఇఒఆర్‌డి ఈశ్వరయ్య స్వామి, వైసిపి మండల నాయకులు శివారెడ్డి గౌడ్‌, ఎంఇఒలు సుదర్శన్‌ రెడ్డి, రఘునాథ్‌, వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ చిన్న వీరన్న, సిసిలు సబీనా, జనార్ధన్‌, శారదా దేవి, భాగ్యమ్మ, ఆదిలక్ష్మి, మహాలక్ష్మి, ఆనంద్‌, త్రివేణి, గాయత్రీ, నాగరత్నమ్మ, గిరిజ, సురేష్‌, బసవ, అరుణ, వెంకటేష్‌, రాణి, ప్రసాద్‌, మద్దీశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు. హోళగుంద మండలంలోని గజ్జహల్లి గ్రామంలో భారత్‌ వికసిత్‌ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ఆరోగ్య సహాయ శాఖ మంత్రి ఎస్‌పి.సింగ్‌ బఘేల్‌ పర్యటించారు. సబ్‌ కలెక్టర్‌ శివ నారాయణ శర్మ, జడ్‌పి సిఇఒ నాసర రెడ్డి, సర్పంచి నాగమ్మ, డిఎల్‌పిఒ నాగరాజు నాయుడు, బిజెపి జిల్లా అధ్యక్షులు నీలకంఠ, నేషనల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ చిదానంద, తాలూకా కన్వీనర్‌ వెంకటరాముడు, మండల అధ్యక్షులు నరసింహ ప్రసాద్‌, జిల్లా కిసాన్‌ మోర్చా జనరల్‌ సెక్రటరీ రామలింగ, జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ సుధా పాల్గొన్నారు.

➡️