వినూత్నంగా అంగన్వాడీల సమ్మె

Dec 31,2023 16:33 #Kurnool
anganwadi workers strike 20th day krnl

ప్రజాశక్తి -కోడుమూరు : అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్నసమ్మె 20వ రోజుకు చేరిన సందర్భంగా అంగన్వాడీలు అమ్మవారికి పూనకం వచ్చిన రీతిలో నిరసన తెలియజేశారు. ఒక కార్యకర్త అమ్మవారి రూపంలో తన జట్టు విరబూచుకొని తోటి కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని వేపాకు చేత పట్టుకుని జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ఆ అమ్మవారు ప్రసాదించాలని అమ్మవారి రూపంలో ఉన్నటువంటి కార్యకర్తను అడిగారు నాయకులు .గఫూర్మియా వీరన్న .మాట్లాడుతూ 2023 సంవత్సరం ఈరోజుతో ముగిసిపోతుంది ఉదయం తెల్లారేసరికి తెల్లవారుజామున 12 గంటలకి 2024 వ నూతన సంవత్సరం రాబోతున్నది 23 సంవత్సరం ఎలా ముగిసిందో అంగన్వాడీల సమస్యల పరిష్కరించకపోతే 24 వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే ముగిసిపోతుందని అంగన్వాడీ నాయకురాలు విజయభారతి .సూలమ్మ విమర్శించారు గత 20 రోజుల నుండి అంగన్వాడీలు తమ జీతాలు పెంచమని పిల్లాపాపలను వదిలిపెట్టి రోడ్లమీద ఆందోళన చేస్తుంటే కనీసం ఈ ప్రభుత్వం మహిళలని కూడా చూడకుండా దుర్మార్గంగా మహిళలపై వివక్షత చూపిస్తూ కాలం గడుపుతున్నది జగన్మోహన్ రెడ్డికి ఒకపక్క ప్రభుత్వం పడిపోతుంది అనే భయం ఉన్నా మేకపోతు గంభీరంలాగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడానికి అహంకారంతో ఉన్నాడు సంబంధిత మంత్రి మహిళ అయ్యిండి కూడా యూనియన్ నాయకులను తీసుకొని ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని సమస్యలను పరిష్కరించడంలో చాలా విఫలమైపోయారు ఎందుకంటే ఆమె సీటు ఉంటుందో లేదో అని భయాందోళనలో ఉన్నది ప్రజా ప్రతినిదులందరు వారి సీట్ల పైన వారికి నమ్మకం లేదు. ఇక రాష్ట్ర ప్రజల గురించి .కార్మికుల గురించి .రైతుల గురించి పేదల గురించి పట్టించుకునే పరిస్థితిలో ఎక్కడ ఉన్నారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి వెంటనే జీతాలు పెంచాలని వారి డిమాండ్ చేశారు అవసరమైతే ఒకటవ తేదీ నుండి ప్రత్యక్ష కార్యాచరణ రూపంలో ఆందోళన చాలా ఉధృతంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం సూపర్వైజర్లను ఉసిగొలిపి పేద అంగన్వాడి కార్యకర్తలను జీతాలు ఇప్పిస్తాము డ్యూటీలకు రండి అని మభ్యపెడుతున్నారు యూనియన్ గా మేము హెచ్చరిస్తున్నాం సూపర్వైజర్లు గాని మరి ఇతర ఏ అధికారులైనా సరే అంగన్వాడి హెల్పర్లను కానీ టీచర్లను గాని భయభ్రాంతుల గురిచేసి ఇబ్బంది పెడితే అధికారులు అని కూడా చూడకుండా కార్యక్రమం లో ఉంటాం ఇదే మా హెచ్చరిక దయచేసి అధికారులు చేసే ప్రయత్నం ప్రభుత్వం తో చేసి మా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తే సంతోషంగా విధుల్లోకి హాజరు కావడానికి అంగన్వాడీలకు ఎలాంటి అభ్యంతరం లేదు ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకురాలు .అరుణ భాగ్యమ్మ .రజియా ఫాతిమా .హైమావతి మండలంలోని అంగన్వాడి కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.

➡️