టిడిపి అభ్యర్థి కొండయ్యను గెలిపించుకుందాం

ప్రజాశక్తి-చీరాల: రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం కూటమిని అధికారంలోకి తెచ్చుకొని, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకొని, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందా మని టిడిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య తనయుడు, యువనేత గౌరీ అమర్నాథ్‌ అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక కామధేను కాంప్లెక్స్‌లో బెంగళూరు టిడిపి ఫారం ఆధ్వర్యంలో ఎలక్షన్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి చీరాల నియోజకవర్గం శాసనసభ్యునిగా మద్దులూరి మాలకొండయ్యను, అదే విధంగా బాపట్ల పార్లమెంట్‌ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్‌ల గెలుపే లక్ష్యంగా బెంగళూరు టిడిపి ఫారమ్‌ సభ్యులందరూ కామధేను కాంప్లెక్స్‌లో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు టిడిపి ఫామ్‌ ప్రతినిధులు, నరాల తిరుపతి రాయుడు, కర్పూరపు సుబ్బలక్ష్మి, మోహన్‌ గౌడ్‌, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

➡️