మాధవమ్మను గెలిపించుకుందాం

Apr 27,2024 21:12

ప్రజాశక్తి – పూసపాటిరేగ : ఎన్‌డిఎ కూటమి అభ్యర్ధి లోకం నాగమాధవమ్మని మనం గెలిపించుకోవాలని నెల్లిమర్ల నియోజకవర్గ టిడిపి ఇంచార్జి కర్రోతు బంగార్రాజు కోరారు. శనివారం పసుపాం, కొళ్లాయి వలస, ఎరుకొండ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె ఇంటింటికి తిరిగి మీ ఆడబిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. గ్లాసు గుర్తుపై ఓటువేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కర్రోతు బంగారాజు మాట్లాడుతూ నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసేందుకు మనం మాదవమ్మను గెలిపించుకో వాలన్నారు. రానున్న రోజుల్లో మన ప్రాంతం ఎంతంగానో అభివృద్ది చెందనుందన్నారు. ప్రచార ంలో ఆయనతోపాటు టిడిపి మండల అధ్యక్షలు మహంతి శంకరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్య దర్శి మహంతి చిన్నంనాయుడు, రాష్ట్ర కార్యదర్శి పతివాడ తమ్మునాయుడు, నాయకులు ఆకిరి ప్రసాదరావు, జనసేన మండల పార్టీ అధ్యక్షలు జలపారి శివ, పతివాడ శ్రీను, పులపా మల్లేశ్వ రావు, నక్కాన రమణ, బాలా అప్పలరాజు, మహ ంతి శివ, నర్సన్న, కంది రమణ పాల్గొన్నారు.

➡️