లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజాశక్తి -కనిగిరి : ఈ నెల 29న నిర్వహి స్తున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షి దారులు సద్వి నియోగం చేసుకోవాలని కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి కె. భరత్‌ చంద్ర తెలిపారు. స్థానిక కోర్టు ఆవరణలో కనిగిరి కోర్టు పరిధిలోని పోలీస్‌ సిబ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని తెలిపారు. కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోనేటట్లు చూడాలని పోలీస్‌ సిబ్బందికి సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయశాఖ కషి చేస్తున్నదని, అందులో భాగంగానే లోక్‌ అదాలత్‌లు నిర్వహించి కేసులు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. వాది, ప్రతివాదులు కాలయాపన చేయకుండా రాజీ ద్వారా కేసులు పరిష్కరించ ుకోవాలని సూచించారు. రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులను లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

➡️