రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

కురుపాం (మన్యం) : రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన మంగళవారం కురుపాంలో జరిగింది. కురుపాం మండలం ములిగూడ సెంటర్‌ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన స్టాపర్స్‌ ని బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ పై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు దండుసూర గ్రామానికి చెందిన కొండగొర్రి సూర్యనారాయణగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️