ఘనంగా గుడ్‌ ఫ్రైడే వేడుకలు

Mar 29,2024 21:35

 కురుపాం : మండల కేంద్రంలో గల రావాడ రహదారి సమీపంలో ఉన్న గుడ్‌ సమారిటన్‌ లూథరన్‌ దేవాలయం, దొనకవీధిలో ఉన్న ఇమ్మానియేలు లూథరన్‌ దేవాలయంలో పాస్టర్‌ రెవరెండ్‌ పి.జీవన్‌కుమార్‌ప్రకాష్‌ ఆధ్వర్యంలో ఘనంగా గుడ్‌ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్‌ ఏసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలకు సంబంధించి క్రైస్తవ సహౌదరి, సహౌదరులకు దైవ సందేశాన్ని వివరించారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు డి.జాన్‌, డి.రాజారత్నం, కోట సుందర సుదర్శన్‌, డి.ప్రదీప్‌ కుమార్‌, జి.సుధా, డి.సుకన్య, రత్నమ్మ, కోట ఈశ్వరరావు, డి.జయ కుమార్‌ పాల్గొన్నారు.సీతంపేట : గుడ్‌ ఫ్రైడే సంధర్బంగా సీతంపేట విచారణ పరిధిలోని విశ్వాసులు కంబగూడ లొయోలా సెంటర్‌ నుంచి గొయిది ఫాతిమామాత దేవాలయం వరకు శిలువమార్గం చేస్తూ పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా ఏసుక్రీస్తు సిలువ వేసే సమయంలో పడిన పాట్లును వివిధ వేషధారణలతో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఫాదర్‌ విద్యాసాగర్‌, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సీతానగరం మండలంలోని కాసాపేటలో గల చర్చిలో గ్రామ సేవకుల, క్రిస్టియన్లు అంతా కలిసి నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొని వారితో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, సేవకులు, సంఘ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.గరుగుబిల్లి: స్థానిక ఆర్‌సిఎం చర్చి ఆధ్వర్యంలో గుడ్‌ ఫ్రైడే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన వీధిలో ప్రార్థనలు చేసు కుంటూ ర్యాలీగా వెళ్లారు. అనంతరం రెవరెండ్‌ ఫాదర్‌ జ్ఞానప్రసాద్‌ గుడ్‌ ఫ్రైడే విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో గొర్రెల దాసు, దేవాతి అర్లప్ప, గొర్రెల దిలీప్‌, అరసాడ రాజు, గంట చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం : స్థానిక తెలుగు బాప్టిస్ట్‌ చర్చి, ఆర్‌సిఎం చర్చిలతో పాటు తలవరం, తూడి, బిటి వాడ, వండువ, కత్తులకవిటి, హుస్సేన్‌పురం తదితర గ్రామాల్లో శుక్రవారం గుడ్‌ ఫ్రైడ్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగు బాప్టిస్ట్‌ దేవాలయం సంఘ కాపరి అభిషేక్‌ గుడ్‌ఫ్రైడే విశిష్టతను వివరించారు.

➡️