బస్సుల కోసం నిరీక్షణ

Jan 17,2024 21:24

ప్రజాశక్తి-వీరఘట్టం : సంక్రాంతి పండగకు వచ్చిన వారంతా ఆయా కుటుంబాలు, బంధుమిత్రులతో సంతోషంగా గడిపి బుధవారం తిరుగుముఖం పట్టారు. కానీ ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు బస్సులు లేకపోవడం, సమయానికి రాకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రంలోని అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద అటువైపు పాలకొండ, ఇటువైపు పార్వతీపురం వెళ్లేందుకు సకాలంలో బస్సులు రాలేదు. దీంతో ప్రయాణికులు ఎండల్లోనే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఒకవేళ బస్సులు వచ్చినా రద్దీగా ఉండటం వల్ల ఇరుకిరుకుగా ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొంతమంది ప్రయివేటు వాహనాలను ఆశ్రయించారు.

➡️