సుఖ:సంతోషాలు వెల్లివిరియాలి : డిప్యూటీ సిఎం రాజన్నదొర

Jan 13,2024 20:28

సాలూరు: సంక్రాంతి పండుగ శుభ వేళ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలు వెల్లివిరియాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి లోగిళ్ళు భోగ భాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో నిండి, ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరారు. పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రైతాంగం కూడా ఎంతో సంతోషంగా ఉందని రాజన్నదొర పేర్కొన్నారు.

జిల్లా ప్రజలకు కలెక్టర్‌ సంక్రాంతి శుభాకాంక్షలుప్రజాశక్తి – పార్వతీపురం జిల్లా ప్రజలకు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగ ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, శుభాలు, ప్రతి ఇంటా కాంతులు వెదజల్లాలని ఆకాక్షించారు.

➡️