గణితావధాని నారాయణమూర్తి మృతి

May 23,2024 21:35

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : పట్టణంలో వివేకానంద కాలనీకి చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, గణితావధాని నేరెళ్ల నారాయణమూర్తి బుధవారం రాత్రి మృతిచెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఉపాధ్యాయ వృత్తిలో చేరిన నుండి గణితంపై ప్రతిఒక్కరూ ఆసక్తి కనబరిచేలా సులభరీతిలో బోధన చేసేవారు. పార్వతీపురం పట్టణంతోపాటు చుట్టుపక్కల ఉండే పలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను గణితంలో ప్రావీణ్యులుగా తయారు చేశారు. ఆయన శిష్యులు, పట్టణ ప్రముఖులు, రాజకీయ నేతలు, ఉపాధ్యాయులు.. నారాయణమూర్తి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

➡️