ప్రజలకు అందుబాటులో ఉండి, అభివృద్ది చేసే వారిని గెలిపించండి : మేయర్ విజయలక్ష్మి

Apr 4,2024 16:40 #Vizianagaram

49 డివిజన్ లో ఎన్నికల ప్రచారం చేసిన డెప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : నగరంలోని 49వ డివిజన్ గాజులరేగ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. ఈయనకు స్థానికులు, వైసిపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్ నడిపిల్లి ఆదినారాయణ మాట్లాడుతూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులనే గెలిపించాలని తద్వారా నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా పయనించేందుకు అవకాశం ఉంటుందని ఓటర్లను అభ్యర్థించారు. మరోసారి శాసనసభ్యులుగా కోలగట్ల వీరభద్ర స్వామికి అవకాశాన్ని ఇస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో కోలగట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచారన్నారు. అన్ని ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసారన్నారు. తాగునీటి సమస్య లేకుండా రోజు విడిచి రోజు నీటి పంపిణీ జరిగే విధంగా ప్రణాళిక బద్ధంగా కృషి చేశారన్నారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు నగర సుందరీకరణకు పాటుపడడం వల్ల నగరం అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా పయనించిందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వానికి మరోసారి ఓటు ద్వారా ఆశీర్వాదాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు మన్యాల కృష్ణ, 50వ డివిజన్ కార్పొరేటర్ పట్టా ఆదిలక్ష్మి, వైసిపి నాయకులు కణుగుల రాజా, వైసిపి నగర ప్రధాన కార్యదర్శి జామాన శ్రీనివాసరావు,జమ్ము మధు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️