టీడీపి నుండి వైసిపిలో చేరిన మైనారిటీలు

Apr 4,2024 17:40 #anatapuram

ప్రజాశక్తి:- చిలమత్తూరు : మండల కేంద్రంలోని పలువురి టీడిపి కి చెందిన మైనారిటిలు వైసిపి నాయకులు అన్సర్ అహ్మద్ ఆద్వర్యంలో వైసిపి పార్టీలోకి చేరారు.ఈ మేరకు వైసిపి నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక భర్త వేణు,అబ్ధుల్ ఘనీ ఎంపిపి పురుషోత్తమ రెడ్డి సమక్షంలో లక్ష్మినరసింహ స్వామి వీదిలోని మైనారిటీలు సుమారు వంద కుటుంబాలు టీడీపి నుండి వైసిపి లో చేరారు. టీడీపి బీజేపితో జతకట్టడంతో మైనారిటీల భవష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. కావున తామంతా వైసిపి చేరినట్లు మైనారిటీలు అన్నారు. మైనారిటీల రక్షణ వైసిపితో సాద్యం అన్న భరోసాతో అన్సర్ అహ్మాద్ సూచన మేరకు వైసిపి చేరామని అన్నారు. ఈ కార్యక్రమం లో వైసిపి నాయకులు ప్రభాకర్ రెడ్డి,అమర్నాథ్ రెడ్డి,రాఘవేంద్ర రెడ్డి,హనుమంతు రెడ్డి,మైనారిటీలు షాకీర్,రహంతుల్లా,నయిం తదితరులు పాల్గొన్నారు‌.

➡️