మాజీ ఎమ్మెల్యేల ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే నిమ్మల

Apr 19,2024 12:08 #blessings, #former MLAs, #MLA NIMMALA

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు శుక్రవారం నామినేషన్‌ వేసేందుకు వెళుతున్న సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందుగా రాజకీయ కురువృద్ధులైన మాజీ ఎంపీ చేగొండి వెంకట హరి రామ జోగయ్య ఆశీస్సులు తీసుకున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే డా బాబ్జి, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ లను స్వయంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించేలా ఆశీస్సులు అందించాలనిహొకోరారు. ఎన్నికల్లో పాలకొల్లు నుంచి పోటీ చేసేందుకు నిమ్మల శుక్రవారం రోజున నామినేషన్‌ వేస్తున్న సందర్భంగా పాలకొల్లు ఆర్యవైశ్య ప్రముఖులు మాటూరి వీర వెంకట నరసింహమూర్తి, నాళం బాపిరాజు ల చేతుల మీదుగా నామినేషన్‌ కు ధరావతు సొమ్మును అందించి ఆశీర్వదించారు.

➡️