ఆర్యవైశ్యులకు అండగా ఉంటా: ఎంఎం కొండయ్య

ప్రజాశక్తి-చీరాల: చీరాల నియోజకవర్గం మహాత్మాగాంధీ క్లాత్‌ మార్కెట్‌లో వినాయకుడి గుడి వద్ద పూజా కార్యక్రమాలతో ప్రారంభమై క్లాత్‌ మార్కెట్లో షాప్‌ టు షాప్‌ ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో అత్యధిక షాపు ఓనర్లు శాలువాలతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్యను సత్కరించి తమ మద్దతు ఎప్పుడూ మీకే ఉంటుందని తెలిపారు. క్లాత్‌ మార్కెట్‌ ప్రెసిడెంట్‌ వేముల శేఖర్‌, సెక్రటరీ తాతా కుమారస్వామి స్వాగతం పలికారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు మామిడిపాక హరిప్రసాద్‌, పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, బాపట్ల పార్లమెంట్‌ వాణిజ్య విభాగ కార్యనిర్వహణ కార్యదర్శి నూతికట్టు పూర్ణ, చీరాల పట్టణ వాణిజ్యభాగ అధ్యక్షులు పోతుగంటి రామాంజనేయులు, సెక్రటరీ శ్రీరాం రమేష్‌, గార్లపాటి వెంకట శివరామ గుప్తా, బిజెపి బాపట్ల జిల్లా నాయకురాలు భవాని గారు, జనసేన పార్టీ జన సైనికురాలు కారంపూడి పద్మిని, మామిడాల శ్రీనివాసరావు, కర్పూరపు సుబ్బలక్ష్మి, అనపర్తి రత్నబాబు, ఏసోబు, రబ్బవరపు సుధాకర్‌, తుపాకుల రఘునాథ బాబు, తేలప్రోలు నాగేశ్వరరావు, లావేటి శ్రీనివాస్‌ తేజ, కూరపాటి పూర్ణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️