మేడే స్ఫూర్తితో ఉద్యమాలు

May 1,2024 21:10

ప్రజాశక్తి-శృంగవరపుకోట: మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కుల రక్షణ కోసం భవిష్యత్తు ఉద్యమాలకు సిద్ధమౌదామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా బుధవారం మండలంలోని వెంకటరమణపేట క్వారీలు, కొత్తూరు గ్రామంలో, పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, దేవి కూడలిలో ఆటోస్టాండ్‌ వద్ద ఆయన అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఎన్నో సమస్యలను పోరాడి పరిష్కరించుకున్నామని తెలిపారు. నేడు మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను నేరుగార్చే చట్టాలను తీసుకొస్తున్నారని విమర్శించారు. మోడీ విధానాల వల్ల దేశంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఐక్య ఉద్యమాలతో పోరాడి మోడీ ఎత్తులను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, జిల్లా నాయకులు చెలికాని ముత్యాలు, చంటి, సత్యనారాయణ, నాయుడు, దేవి, గోవిందా, భారతి, వరం తదితరులు పాల్గొన్నారు.జామి : జామి బస్టాండ్లో కార్మికులు మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనియన్‌ నాయకులు కిరణ్‌, కిషోర్‌, రమణ తదితరులు పాల్గొని, సిఐటియు జెండా ఆవిష్కరించారు. మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించి, పంపిణీ చేపట్టారు. జాగరం గ్రామంలో జాగారం వాసవి క్లబ్‌ ఆధ్వ ర్యంలో మేడే నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. క్లబ్‌ ఆధ్యక్షులు ప్రసాద్‌ పాల్గొన్నారు.నెల్లిమర్ల : నగర పంచాయతీలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిమ్స్‌ ఆసుపత్రి వద్ద మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి మిరప నారాయణ మేడే జెండా ఎగుర వేశారు. అనంతరం అధ్యక్షులు టివి రమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేష్‌, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మిరప నారాయణ మాట్లాడుతూ మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటాల ద్వారా సమస్యలు పరిష్కరించుకు న్నారని ఆ పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సిఐటియు నాయకులు కిల్లంపల్లి రామారావు, మిమ్స్‌ యూనియన్‌ నాయకులు కె. కామునాయుడు, ఎం. నాగ భూషణం, గౌరి, బి. బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎపి బేవరేజేస్‌ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నాయకులు రెడ్డి శంకరరావు జెండా ఆవిష్కరణ చేశారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఏపి మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నాయకులు జగన్మోహన్‌ రావు ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కమిటి సభ్యులు కిల్లంపల్లి రామారావు, నాయకులు యుఎస్‌ రవి కుమార్‌ జెండా ఎగుర వేశారు. యూనియన్‌ నాయకులు టి. బాబు రావు, హరిబాబు, శ్రీను పాల్గొన్నారు. జరజాప ుపేటలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మే డే జెండాను ఎగురవేశారు. మొయిద జంక్షన్‌లో ఆటో కార్మికుల ఆధ్వర్యంలో కార్మికుడు టి. అప్పల నరసయ్య జెండా ఎగుర వేశారు. స్థానిక విద్యుత్‌ జిల్లా స్టోర్స్‌ వద్ద హమాలీ సంఘం ఆధ్వర్యంలో హమాలీ సంఘం నాయ కులు జెండా ఎగుర వేశారు. భవన నిర్మాణ కార్మికులు ఎం.ప్రకాష్‌, జె. సత్యా రావు, ఎం.అప్పన్న, హమాలీ సంఘం నాయకులు పి.లక్ష్మణ రావు, కె. గోవిందరావు, అప్పలనాయుడు, పాల్గొన్నారు.బొబ్బిలి : మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు కోరారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద బుధవారం మేడే సందర్భంగా సిఐటియు జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఎఐటియుసి ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఎం.శ్రీనివాసరావు ఎగురవేశారు. అంబేద్కర్‌ విగ్రహానికి సొరు సాంబయ్య పూలమాలలు వేశారు. కార్మికుల హక్కులకు నష్టం చేసే లేబర్‌ కోడ్‌ చట్టాలను రద్దు చేయాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.ఝాన్సీ పిలుపునిచ్చారు. పట్టణ కళాసీ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తాండ్ర పాపారాయ విగ్రహం జంక్షన్లో బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఇఫ్టూ(న్యూ) రాష్ట్ర కమిటీ సభ్యులు బి.శంకరరావు, పట్టణ కళాసీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి.అప్పలస్వామి, డి.వర్మ పాల్గొన్నారు.రామభద్రపురం : స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్సు వద్ద వివిధ కార్మిక సంఘాల నాయకులతో కలిసి సిఐటియు మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావు ఎర్రజెండాను ఎగురవేశారు. దళితవాడలో అరుణ పతాకాన్ని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మణికుమార్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో లక్ష్మి, సత్యవతి, చిన్నమ్ములు, పోలమ్మ, తదితరులు పాల్గొన్నారు.కొత్తవలస : కొత్తవలసలో ఆటో స్టాండ్‌, జిందాల్‌, ముఠా కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు మేడేను నిర్వహిం చారు. సిఐటియు జిల్లా నాయకులు గాడి అప్పారావు జెండాను ఎగురవేశారు. జిందాల్‌ కార్మికులు నమ్మి చినబాబు, బొట్ట రాము, ఈశ్వరావు, ఆటో, ముఠా కార్మికులు పాల్గొన్నారు. కొత్తవలస జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆవరణలో మండల లీగల్‌ సెల్‌ అథారిటీ ఆధ్వర్యంలో మేడేను నిర్వహించారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి విజరు చందర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డి.వి.ఎల్‌ దేవి, కార్యదర్శి డి.శ్రీనివాస్‌, సీనియర్‌ న్యాయవాదులు ఎన్‌. శ్రీరామమూర్తి, జి.మహేంద్ర, శివప్రసాద్‌ పాల్గొన్నారు.వేపాడ : మండలంలోని సోంపురం క్వారీ కూడలి, బొద్దాం కూడలిలో సిఐటియు నాయకులు చల్లా జగన్‌ ఆధ్వర్యాన మేడే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో రామస్వామి పేట అప్పలనాయుడు, పాటూరు అప్పలనాయుడు, జి.గోవింద, పాలు శ్రీను, దారబాబు,వై.రమణ పాల్గొన్నారు. గరివిడి: మే డే సందర్భంగా మండలంలో దేవాడ మైన్స్‌ డిఎఫ్‌ఎన్‌ ఆర్‌ఎంఎంఆర్‌బిఎస్‌బిఎఫ్‌ అండ్‌ దాస్‌ కంపెనీ దగ్గర, మెయిన్‌ రోడ్‌లో గల సిఐటియు ఆఫీస్‌ దగ్గర నాయకులు జెండా ఎగరవేశారు. సిఐటియు డివిజన్‌ కార్యదర్శి ఎ.గౌరి నాయుడు, మైన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ సంఘం నాయకుల, పర్మినెంట్‌ కార్మికులు పాల్గొన్నారు.దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి ఆటో స్టాండ్‌ వద్ద శ్రీ మజ్జి గౌరమ్మ ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని చేపట్టారు. యూనియన్‌ అధ్యక్షులు ఎల్‌ గాలినాయుడు, కార్యదర్శి బి.అప్పలనాయుడు జెండా ఆవిష్కరణ చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె శ్రీనివాస్‌, న్యూటన్‌ పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ బడే ప్రసాద్‌, ఆటో కార్మికులు రామారావు, చంటి, లక్ష్మణరావు, శ్రీను, బాబి, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.తెర్లాం: మేడే స్పూర్తితో కార్మికుల హక్కులు కోసం పోరాటం చేయాలని సిఐటియు నాయకులు ఎస్‌.గోపాలం కోరారు. స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ సమీపంలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాం వద్ద సిఐటియు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రీన్‌ అంబాసిడర్లు, డప్పు కళాకారులు పాల్గొన్నారు.గజపతినగరం: స్థానిక మెయిన్‌ రోడ్డు ఎస్‌బిఐ ఆవరణలో మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. పంచాయతీ కార్మిక నాయకులు కనకరాజు, అంగన్‌వాడీ నాయకులు సుభాషిని, రిక్షా కార్మిక నాయకులు సూర్యనారా యణలు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్‌ మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కులపై పోరాటం చేయాలన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు బి కాంతారావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి. రాము, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు హరికృష్ణ, పంచాయతీ కార్మికులు, రిక్షా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.రేగిడి: మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా ఉండి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిఐటియు బొబ్బిలి డివిజన్‌ జిల్లా అధ్యక్షులు పి. శంకరరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఉంగరాడ మెట్ట వద్ద 139వ మే డే దినోత్సవం వేడుకల్లో భాగంగా భవన నిర్మాణ కార్మికులు వంజరాపు తిరుపతిరావు, మడపాన తిరునాధ రవిశంకర్‌ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా ఉండి, పెట్టుబడిదారీ వర్గాన్ని దాని కొమ్ముగాస్తున్న పాలకవర్గాలను ఓడించేందుకు పోరాడాలని పిలుపుని చ్చారు.

➡️