అంగన్వాడీల సమ్మెకు మున్సిపల్ కార్మికుల మద్దతు

Dec 25,2023 14:37 #Konaseema

ప్రజాశక్తి మండపేట(అంబేద్కర్ కోనసీమ) : కనీస వేతనం రూ.26 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు, తదితర సమస్యల పరిష్కారం కోరుతూ … అంగన్‌వాడీలు మునిసిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మెకు మున్సిపల్ కార్మికులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక, అంగన్వాడీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల హామీలలో భాగంగా తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం దిగచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మిక నాయకులు బంగారు కొండ, కొమరపు నరేంద్ర కుమార్, మండపేట ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ బేబీ, ఆదిలక్ష్మి, సిహెచ్ రాణి, మంగాదేవి, జానకి, అనంత, దేవకి, దుర్గా, వజ్రం, కుమారి, నాగలక్ష్మి, కమల, సత్యవేణి, పద్మ, నూకరత్నం తదితరులు పాల్గొన్నారు.

➡️