ఆళ్లగడ్డలో వైఎస్‌ షర్మిలకు ఘన స్వాగతం

Jan 29,2024 21:25

ఆళ్లగడ్డలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు గజమాలతో స్వాగతం పలుకుతున్న నాయకులు

ఆళ్లగడ్డలో వైఎస్‌ షర్మిలకు ఘన స్వాగతం
ప్రజాశక్తి – ఆళ్లగడ్డ
కడప నుండి కర్నూల్‌కు వెళ్తున్న కాంగ్రెస్‌ పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు ఆళ్లగడ్డలో పార్టీ నాయకులు సోమవారం ఘన స్వాగతం పలికారు. ఆళ్లగడ్డలో కొద్దిసేపు వైఎస్‌ షర్మిల కొద్దిసేపు ఆగారు. పిసిసి నంద్యాల పార్లమెంట్‌ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు బరగొడ్ల హుస్సేన్‌ భాషా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో షర్మిలకు ఘన స్వాగతం పలికారు. షర్మిలను చూసేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ఎస్‌ఐలు వెంకట్‌ రెడ్డి, షేక్‌ నగీనాలు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ, బరుగొడ్ల హుస్సేన్‌ బాషా మాట్లాడుతూ వైఎస్‌ షర్మిలను విమర్శిస్తే సహించబోమన్నారు. ఒకప్పుడు ఆళ్లగడ్డ కాంగ్రెస్‌కు కంచుకోట అని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారని, రాష్ట్రంలో ఆళ్లగడ్డలో కాంగ్రెస్‌ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేసి కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిరివెళ్ల, రుద్రవరం మండలాల అధ్యక్షులు పసుపులేటి లక్ష్మీ నరసింహుడు, శ్రీనివాసులు యాదవ్‌, జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు మహబూబ్‌ బాషా, దొర్నిపాడు, చాగలమర్రి మండలాల అధ్యక్షులు నాగయ్య, పాపాజీ, సంజీవ కుమార్‌, కార్యకర్తలు నజీర్‌ భాష, హుస్సేన్‌, మాబాషా, శంకర్‌ రెడ్డి, శేఖర్‌ రెడ్డి, శివారెడ్డి, హుస్సేన్‌ రెడ్డి, నరసయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

➡️