మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రార్థన చేస్తూ నిరసన

Jan 7,2024 17:30

దీక్షా శిబిరంలో ప్రార్థన నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులు

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రార్థన చేస్తూ నిరసన
ప్రజాశక్తి – ఆత్మకు రు
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, జీతాలు పెంచాలని, మున్సిపల్ కార్మికుల కుటుంబాలను కాపాడాలని సిఐటియు పట్టణ అధ్యక్షులు రజాక్, కార్యదర్శి రామ్ నాయక్, ఉపాధ్యక్షులు రణధీర్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు గొడుగు రాజు, జోసెఫ్ లు అన్నారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట 13వ రోజు సమ్మె చేపట్టి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేలే సీఎంకు బుద్ధి ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అసెంబ్లీలో చెప్పిన మాటలను నెరవేర్చాలని ప్రార్థనలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి 13 రోజులుగా సమ్మె చేస్తున్న ఏమాత్రం చల్లించడం లేదు సీఎం జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించి మా సమస్యలను పరిష్కారం చేసేలా చూడాలని ప్రార్థనలు చేశారు. స్కిల్డ్ , సెమి స్కిల్డ్, వేతనాలను జీవో నెంబర్ 7 ప్రకారం అర్హులైన వారందరికీ ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. డిమాండ్ల సాధనకు కార్మికులంతా మరింత ఐకమత్యంగా పోరాటాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కార్మికులు తిమయ్య, నాగన్న, మోహన్, సురేష్, దానమయ్య, రవి, రూతమ్మ, జీవరత్నమ్మ, మణెమ్మ, సుగుణమ్మ, కుమారి, సుశీలమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️