సమస్యలపై ఎమ్మెల్యే స్పందించడం లేదు

Feb 24,2024 19:38

 పార్టీలో చేరిన వారితో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా

సమస్యలపై ఎమ్మెల్యే స్పందించడం లేదు

– మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

ప్రజాశక్తి – చాగలమర్రి

తాలూకాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే స్పందించడం లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. చాలుమర్రి మండలం మల్లె వేముల గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ఈదుల శంకర్‌ రెడ్డి, నంది వాహన రెడ్డి, విగేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి, సాంబశివరెడ్డి, వెంకటేశ్వర్‌ రెడ్డి, శేఖర్‌ రెడ్డి లతోపాటు మరో 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వీరికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేళ్ల అరాచక పాలనలో విసిగిపోయిన ప్రతి ఒక్కరి మనసులో నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకో వాలన్న తపన బలంగా ఉందని అన్నారు. తాలుకాలో ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతుంటే ప్రజా ప్రతినిధులు. పండగలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి తాలూకా నాయకులు భార్గవ్‌ రామ్‌, మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి, సెగ రెడ్డి, టిడిపి నాయకులు కొలిమి మాబు షరీఫ్‌ , మౌలాలి ఖలీల్‌ , హనీఫ్‌ ,ముల్లా అబ్దుల్లా, జెట్టి నాగరాజు, బషీర్‌, కొలిమి షబ్బీర్‌, కొలిమి ప్రతాప్‌ రెడ్డి, లక్ష్మిరెడ్డి, శేఖర్‌ రెడ్డి, అష్రాఫ్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️