జూన్‌ 29న జాతీయ లోక్‌అదాలత్‌

ప్రజాశక్తి-గిద్దలూరు: జాతీయ లోక్‌ అదాలత్‌ జూన్‌ 29న జరుగుతుండటంతో గిద్దలూ రు మండల న్యాయ సేవా అధికార సంస్థ తరపున న్యాయవాదులకు, పోలీస్‌ అధికారులకు, బ్యాంకు అధికారులకు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశం లో ముఖ్య అధ్యక్షులుగా ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ ఓంకార్‌ మాట్లాడుతూ జూన్‌ 29న జాతీయ లోక్‌అదాలత్‌లో బాధితులకు సత్వర న్యాయం చూపేలా ఎక్కువ కేసులు రాజీకి కషి చేయాలని సూచించారు. కాబట్టి ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకునేలా చూడాలని, అన్ని రకాల సివిల్‌ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్‌ కేసుల్లో కక్షిదారులు ముందుకు వచ్చేలా అధికారులు చూడాలని అన్నారు. అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి బి మేరీ సారా ధానమ్మ మాట్లాడుతూ ఎక్కువ క్రిమినల్‌ కేసులు రాజీ చేయడం ద్వారా సమాజంలో, కుటుంబంలో శాంతి నెలకొంటుందని, కాబట్టి పోలీసు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

➡️