ఎపి కాంగ్రెస్‌ ఎస్‌సి సెల్‌ కోఆర్డినేటర్‌గా నీతిపూడి

Mar 21,2024 15:38 #ap congress, #BR Ambedkar, #Konaseema

ప్రజాశక్తి -మామిడికుదురు(అంబేద్కర్‌ కోనసీమ) : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు నీతిపూడి బాల సత్యనారాయణను ఎపి కాంగ్రెస్‌ ఎస్‌సి సెల్‌ కోఆర్డినేటర్‌గా అధిష్టానం నియమిస్తు గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన మామిడికుదురు మండల ఎస్‌సి సెల్‌ అధ్యక్షులుగా పనిచేసారు. తన నియామకం కు సహకరించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే, పీసీసీ అధ్యక్షులు షర్మిళ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌,డీసీసీ అధ్యక్షులు కామనప్రభాకర్‌ తదితరులుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా నీతి పూడికి పార్టీ శ్రాణులు పూల మాల వేసి, శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు శీను, మహమ్మద్‌ ఆరిఫ్‌, మాచవరపు శివన్నారాయణ,వడ్డే నాగేశ్వరావు, ఒంటెద్ది బాబి, వాకపల్లి రాంబాబు, అప్పన శ్రీరామకష్ణ నల్లి వెంకటరమణ చిట్టాలా జోగేశ్వరరావు. శర్మ, ములపర్తి మోహనరావు. సరోజినీ దేవి, గేడ్డం వెంకటేశ్వరరావు, వాన రాసి దుర్గారావుతదితరులు పాల్గొన్నారు.

➡️