నిత్యాన్నదాత డొక్కా సీతమ్మ : విజయం చారిటబుల్‌ ట్రస్ట్‌

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : మండపేట పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న విజయం చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు డొక్కా సీతమ్మ 116 వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం వైయస్సార్‌ పార్కులో సీతమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ …. ఉభయ గోదావరిలో నిత్య అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని ఈమె గురించి ఎన్ని సార్లు చెప్పుకున్నా పుణ్యమే అంటు ట్రస్ట్‌ సభ్యులు కొనియాడారు. అన్నపూర్ణ దేవి అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ…! అన్నపూర్ణ దేవీ అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మగా చెప్పుకోవచ్చునని అన్నారు. అర్థరాత్రి రెండుగంటల సమయంలో కూడా తన ఇంటికి ”అమ్మా సీతమ్మ తల్లి ఆకలేస్తుందమ్మా”అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంటచేసి అన్నం పెట్టి ,దుప్పటి ,వస్త్రాలు ఇవ్వగలిగిన ఔదార్యవతి డొక్కాసీతమ్మ తల్లిఅని ఆమె సేవలను కొనియాడారు. ప్రతి ఏటా ఆ మహా తల్లి పేరున విజయం చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులమైన తాము సుమారు 200 మంది వఅద్ధులకు అనాధలకు అల్పాహారం, మరియు అన్నదాన కార్యక్రమం, మజ్జిగ వితరణ కార్యక్రమం లాంటివి మరియు దుప్పటి, వస్త్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ సభ్యులు తెలియజేశారు.

➡️