అవయవదానంపై అవగాహన పెరగాలి

May 8,2024 21:42

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : అవయవదానంపై ప్రజలు మరింత అవగాహన పెరగాలని రెడ్‌క్రాస్‌ సోసైటీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ జీ సమరం అన్నారు. ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకరపర్తి భావనారాయణ కళాశాల జాతీయ సేవా పథకం విభాగాల ఆధ్వర్యంలో అవయువదానంపై అవగాహనా కార్యక్రమాన్ని ఆ కళాశాల ఆవరణలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యవక్తగా హజరైన డాక్టర్‌ సమరం మాట్లాడుతూ అవయువదానంపై అవగాహన లేకపోవటంతో ప్రపంచ వ్యాపితంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రధానంగా నేత్రదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. ఒక భారతదేశంలోనే 15 మిలియన్ల అంధులు, 30 మిలియన్ల మంది సరైన కంటిచూపు లేని వారు ఉన్నారన్నారు. మనం మరణించిన తరువాత మన కళ్లను దానం చేయటం ద్వారా ఎంతో మంది అంథులకు చూపు ప్రసాధించిన వారమవుతామని వివరించారు. ఆ విధమైన అవయవదానాన్ని ప్రొత్సాహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు అధ్యక్షత వహించిన పీవోలు డీ పవన్‌కుమార్‌, ఎన్‌ సాంబశివరావు, శాంతిబాబు, కల్మబేగం తదితరులు పాల్గొన్నారు.

➡️