సిఏఏతో మైనార్టీల ఉనికికి దెబ్బ

Mar 15,2024 17:00 #ntr district

ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : ముస్లిం మైనార్టీల ఉనికిని దెబ్బ కొట్టి, వారి భవిష్యత్తును అంధకారం చేస్తున్న సి ఏ ఏ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సింగినగర్ కృష్ణ హోటల్ సెంటర్ లో గల మసీదు దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది. నిరసనకు మద్దతుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిఏఏ తిప్పి కొట్టకపోతే రేపు దేశమంతటా ఎన్ ఆర్ సి అమలుకు నిరాకండంగా పూనుకుంటారన్నారు. భారతీయులైన మనం భారతదేశంలోని భారతీయులమేనని నిరూపించుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యూలైన్లో నిల్చని పత్రాలు సమర్పించాల్సి వస్తుందనన్నారు. మనమంతా స్వదేశంలో అక్రమ వలసదారులం అవుతామన్నారు. కాబట్టి మతాలకతీతంగా ప్రజలందరూ ఏకమహాలని పౌరసత్వం చట్టం అమలకు తిప్పికొట్టాలని కోరారు. కొత్త చట్ట ప్రకారం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్గానిస్థానాలలో మతపరమైన అణిచివేత వల్ల ముస్లింలకు మినహా మిగిలిన మత ప్రజలకు హిందువులు సిక్కులు బౌద్ధులు క్రైస్తవులకు భారతీయ పౌరసత్వాన్ని ఇస్తారు. ముస్లిం ప్రజలకు మాత్రం పౌరసత్వం ఇవ్వరు. దేశాన్ని ముక్కలు చేసే ప్రమాదం ఉన్న పౌరసత్వం చట్టాన్ని సమర్థించుకోవడానికి ప్రభుత్వం అనేక కుంటి సాకులు చెబుతుందన్నారు. పొరుగు దేశాల్లో మతపరమైన హింసకు గురవుతున్న ప్రజలను మానవ దృష్టితో ఆదుకునేందుకు ఈ చట్టం తెచ్చినట్లు ప్రభుత్వం చెప్తుందని దాని వెనుక అనేక ప్రాంతాలలో ముస్లిం మైనార్టీ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. దానిని ప్రతి ఒక్కరు ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ప్రజలందరు సమానమే అని కులాల, మతాల పేర్లతో విడదీయడం బిజెపి ప్రభుత్వానికి రాబోవు కాలంలో బుద్ధి చెప్పకపోతే ముస్లిం మైనార్టీలకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. బిజెపి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న తెలుగుదేశం జనసేనలను ఓడించాలని అదేవిధంగా వైసిపి ప్రభుత్వం అసెంబ్లీలో ఈ చట్టాన్ని రద్దు చేయాలని తీర్మానించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సిటీ కార్యదర్శి బి రమణారావు, సెంట్రల్ సిటీ అధ్యక్షులు కే దుర్గారావు, ముస్లిం మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

➡️