ఆకట్టుకుంటున్న చార్మినార్‌ ఎగ్జిబిషన్‌

May 4,2024 21:55

నగరంలోని బబ్బూరి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన చార్మినార్‌ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ వ్యాపారవేత్త బబ్బూరి భూపాల్‌ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. చార్మినార్‌ ముఖద్వారంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. తమిళనాడుకు చెందిన కళాకారులు సుమారు 400 మంది 50 రోజుల పాటు శ్రమించి చార్మినార్‌ నమూనాను అందంగా తీర్చిదిద్దారు. ఎగ్జిబిషన్‌ లో ఏర్పాటు చేసిన వాటర్‌ ఫౌంటైయిన్‌, సెల్ఫీ పాయింట్‌ వద్ద ఫొటోలు దిగేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. ఆటవిడుపు కోసం జైంట్‌ విల్‌, మేరి కొలంబస్‌, బ్రేక్‌ డాన్స్‌ ,డ్రాగన్‌ ట్రైన్‌, ఇండియన్‌ టొరాటోరా, ఇటాలియన్‌ ఐటమ్స్‌ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయి. మహిళల కోసం బెంగాలీ కాటన్‌, శారీస్‌, లక్నో సారీస్‌, నైటీస్‌ , కాస్మోటిక్‌ ,గాజులు అనేకమైన ఆటోబొమ్మలు, హ్యాండ్లూమ్స్‌ మరియు హ్యాండ్‌ క్రాఫ్ట్‌ స్టాల్స్‌, అనేక రకాల ఫుడ్‌ స్టాల్స్‌ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు పోతుల కష్ణ అయ్యప్ప మాట్లాడుతూ ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు ఎగ్జిబిషన్‌ కొనసాగు తుందని తెలిపారు. చారిత్రాత్మ కమైన చార్మినార్‌ ను చూసేందుకు హైదరా బాద్‌ వెళ్లకుండా విజయవాడ బబ్బూరి గ్రౌండ్‌ లో ఆ నమూనాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడ నగర ప్రజలు ఈ ఎగ్జిబిషన్‌ ను సందర్శించాలని ఆయన కోరారు. తదనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్‌ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో సందర్శకుల కోసం చార్మినార్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. హైదరాబాద్‌ లో చార్మినార్‌ ఏ తరహాలో ఉంటుందో అదే తరహాలో ఇక్కడ ఏర్పాటు చేసిన చార్మినార్‌ నమూనా విశేషంగా ఆకట్టుకుటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం లో సుబ్బారావు పాల్గొన్నారు.

➡️