ప్రారంభమైన చిన్న తిరునాళ్ల మహోత్సవం 

Mar 25,2024 10:22 #ntr district

ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్ జిల్లా) : పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి ఐదు రోజులు పాటు జరిగే చిన్న తిరుణాల మహోత్సవం ఈరోజు అఖండ జ్యోతి స్థాపనతో ఘనంగా ప్రారంభమైనది. డిప్యూటీ కలెక్టర్ మరియు దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె రమేష్ నాయుడు ముందుగా గణపతి పూజ నిర్వహించి అనంతరం అమ్మవారి అంతరాలయంలో అఖండ జ్యోతి స్థాపన చేసి ఈ చిన్న తిరుణాల మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది అర్చక స్వాములు పాల్గొన్నారు.

➡️