ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

May 7,2024 21:53
  • -పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావు మద్దతుగా స్కూటర్‌ ర్యాలీ

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : గెలిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ పిలుపునిచ్చారు. మోదీ పదేళ్ల పానలో రాజ్యాంగానికి విఘాతం ఏర్పడుతున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌, వామపక్షాలు ఇతర పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పాటైనట్లు చెప్పారు. ఇండియా కూటమి బలపర్చిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నిర్వహించిన స్కూటర్‌ ర్యాలీలో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ, వైసీపీలో ఏ ఒక్కటీ అధికారం చేపట్టినా బీజేపీకి నష్టం లేదన్నారు. చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరిపై కేసులు ఉన్న కారణంగా వారు మోదీ చేతిలో కీలుబొమ్మలుగా మారుతారని చెప్పారు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించటం సహజం అన్నారు. అయితే పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్ధి కులాల వారీగా, మతాల వారీగా ఏసీ కళ్యాణ మంటపాలకు పిలిపించి ఓట్లు అడగటాన్ని ప్రజలు గర్హిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఆలోచించి సీపీఐ తరుపున పోటీ చేస్తున్న తనకు ‘కంకి – కొడవటి’ గుర్తుపై విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి వల్లూరు భార్గవ్‌కు ‘హస్తం’ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ ఇక్కడ జరిగే ఎన్నికలు ధన బలానికి, జన బలానికి మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. ర్యాలీ ముగింపు సభలో పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్‌ దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ మైనార్టీల హక్కుల రక్షణ కోసం ఇండియా కూటమి అభ్యర్థులు చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ర్యాలీ భవానీపురం దర్గా సెంటర్‌ వద్ద ప్రారంభమైన స్వాతి థియేటర్‌, ఊర్మిళా నగర్‌, ఆర్టీసీ వర్క్‌షాపు, కుమ్మరిపాలెం సెంటర్‌, పెజ్జోనిపేట, పూర్ణానందపేట మీదుగా కరుణా హోటల్‌ సెంటర్‌ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాధ్‌, సీపీఎం నాయకులు బోయ సత్యబాబు, సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు కేవీ భాస్కరరావు, తాడి పైడియ్య, మూలి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.55వ డివిజన్‌లో ఆసిఫ్‌ ప్రచారంప్రజాశక్తి – వన్‌టౌన్‌ : ఎన్నికల ప్రచారం భాగంగా మంగళవారం 55వ డివిజన్‌ కార్పొరేటర్‌ శీరంశెట్టి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఎర్రకట్ట కొండ ప్రాంతంలో వైసీపీ అభ్యర్ధి షేక్‌ ఆసిఫ్‌ ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న సంక్షేమం అభివద్ధి వివరిస్తూ జరగబోవు ఎన్నికల్లో పెత్తందారుడికి సామాన్యుడికి జరగబోవు సంగ్రామంలో జగన్మోహన్‌ రెడ్డి సైన్యములో ఒకడైన షేక్‌ ఆసిఫ్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జముల పూర్ణమ్మ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే జగన్‌ మోహన్‌ రావు ప్రచారంప్రజాశక్తి- నందిగామ : ఎన్నికలలో ప్రచారంలో భాగంగా విభరింతల పాడు, పోపూరు గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నందిగామ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహన్‌ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న మేనిఫెస్టోకే ప్రజల విశ్వసనీయత ఉందన్నారు. చంద్రబాబు బూటకపు మాటలను ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల సభ్యుల ఇళ్ల చుట్టూ మీరు తిరిగారా అని ప్రశ్నించారు. ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి జగనన్‌ను గెలిపించండి మరొకసారి సుపరిపాలనను కొనసాగిం చండి అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తంగిరాల సౌమ్య ప్రచారంప్రజాశక్తి – నందిగామ : టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. నందిగామ పట్టణం 13,14 వార్డుల్లో తంగిరాల సౌమ్యకు ప్రజలు స్వాగతం పలికారు. చేరుతున్నారు. నియోజకవర్గంలోలో అభివద్ధి జరగాలంటే టీడీపీతోనే సాధ్యమని అన్నారు.

➡️