పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి : యుటిఎఫ్‌

Mar 2,2024 14:36 #Kurnool, #utf

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు) : యుటిఎఫ్‌ ముద్రించిన ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ పుస్తకాన్ని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మదిరె గామంలో యుటిఎఫ్‌ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు వై.రామాంజనేయులు మాట్లాడుతూ.. ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ నినాదంతో దశలవారి పోరాటంలో భాగంగా పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని.. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరించే వారికి తమ ఓటు ఉంటుందని తెలియజేశారు. యుటిఎఫ్‌ ముద్రించిన పుస్తకంలో సిపిఎస్‌ విధానం నేపథ్యం, సిపిఎస్‌ విధానం వలన ఉద్యోగ ఉపాధ్యాయులకు కలిగే నష్టం,సిపిఎస్‌ పై ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కేంద్రం యొక్క వైఖరిని ఉపాధ్యాయులు అవగాహన చేసుకోవడానికి ఆకాశముందన్నారు. ప్రస్తుతం తమ ఓటు ఎవరికి వేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.రత్నం,యుటిఎఫ్‌ నాయకులు పి.రంగనాయకులు,వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు అరుణ జ్యోతి, ఈరన్నగౌడు, జక్రియ, పర్విన్‌ బాను, బి.సుధాకర్‌ బాబు, కె.రాము, శంకర్‌ నాయక్‌, ఈరన్న, యువరాజు పాల్గొన్నారు.

➡️